Friday, November 22, 2024
Homeరాజకీయంవ్యూహాత్మకంగా పెరుమాండ్ల అడుగులు..

వ్యూహాత్మకంగా పెరుమాండ్ల అడుగులు..

టికెట్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు..
రామకృష్ణకు మద్దతుగా క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాలు
స్థానిక మంత్రి, ఎమ్మెల్యేను కలిసి సపోర్ట్ కోరిన పెరుమాండ్ల..
నేడు 8స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్..!

స్పాట్ వాయిస్, బ్యూరో: వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది తేలేందుకు ఇంకా కొన్ని గడియలే మిగిలాయి. ఇన్నాళ్లు ఆశావహుల పోటాపోటీ ప్రయత్నాలకు బుధవారం సాయంత్రం ఫలితం రానుంది. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8 స్థానాల అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ కానుంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 2 దఫాల్లో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే పోటీ తీవ్రంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు. ఈ స్థానాల్లో ముగ్గురి చొప్పున లిస్ట్ చేసి.. ఫ్లాష్ సర్వేలు చేశారు. జనాల మద్దతు ఉన్న నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. 8స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి నేటి సాయంత్రం ప్రకటించనున్నారు.


వ్యూహాత్మకంగా పెరుమాండ్ల అడుగులు..
వరంగల్ ఎంపీ టికెట్ రేసులో ప్రధానంగా పసునూరి దయాకర్, పెరుమాండ్ల రామకృష్ణ, దొమ్మాటి సాంబయ్య పేర్లు వినిపిస్తున్నాయి. అయితే యువనేత, పేదల డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ టికెట్ దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదలిపెట్టడం లేదు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మంత్రి, ఎమ్మెల్యేలను కలిసి టికెట్ తనకు ఇచ్చేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను ఇప్పటికే నాలుగైదు సార్లు కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.


ఢిల్లీ పెద్దలను కలిసి..
వారం రోజుల క్రితం ఢిల్లీలో సీఈసీ సమావేశం జరిగింది. ఫైనల్ లిస్టులో తన పేరు ఉందనే సమాచారం మేరకు రామకృష్ణ ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నుంచి మొదలుపెడితే.. సీఈసీ సభ్యులందరినీ కలిశారు. ఢిల్లీలో పార్టీ పెద్దలందరినీ కలిసి.. తను పార్టీ కోసం చేసిన పనులు, త్యాగాలను వివరించారు. అంతేకాదు.. తనకు టికెట్ ఇస్తే గెలిచేందుకు ఉన్న అవకాశాలను తెలియజేశారు. అక్కడి నేతల మనస్సు గెలుచుకున్న రామకృష్ణ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు.


సంఘాల మద్దతు..
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, క్రైస్తవ సంఘాల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. రామకృష్ణ సేవ గుణం ఉన్న వ్యక్తి.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే యువ నాయకుడు కావడంతో ఆయన ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. అందరిని కలుపుకుపోయే గుణం ఉన్న పెరుమాండ్లకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ సైతం భారీగా పెరిగిపోయింది. మంగళవారం ఉమ్మడి జిల్లా క్రైస్తవ అసోసియేషన్ సభ్యులు పెరుమాండ్ల రామకృష్ణకు ఎంపీ టికెట్ కేటాయించాలని వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మంత్రితో పాటు ఎమ్మెల్యేందరినీ కలిసి వినతిపత్రాలు ఇచ్చారు.

నేడు తేలనున్న అభ్యర్థులు
ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం బుధవారం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలో పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు. ఇప్పటి వరకు 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ.. పెండింగ్ లో ఉన్న 8 స్థానాలపై చర్చించి సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. 8 స్థానాలను నేడు ఎలాగైనా ప్రకటించే అవకాశం ఉంది.

టార్గెట్ 14..
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించేందుకు ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి 14 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని అధిష్టానంతో శభాష్ అనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తూ రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ స్ట్రాటజీపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. టార్గెట్ 14 రీచ్ అవ్వాల్సిందేనని రేవంత్ నొక్కి చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments