13న రాష్ట్రంలో పోలింగ్
మోగిన ఎన్నికల నగరా
స్పాట్ వాయిస్, బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 17లోక్ సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇక తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ జరగనుంది. నాలుగో విడుతలో మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 13న పోలింగ్ జరుగనుంది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఈసీ వివరించింది.
ఏడు విడతలుగా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడుతలో జరుగనున్నాయి.
తొలి విడత ఏప్రిల్ 19న
రెండో విడుత ఏప్రిల్ 26న
మూడో విడత మే 7న
నాలుగో విడుత మే 13న
ఐదో విడుత 20న,
ఆరో విడుత 25న
ఏడో విడత జూన్ 1న
లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
Recent Comments