6 పడకలతో ప్రత్యేక నిపుణుల క్యాంపు
జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు
జాతర రూట్లలో 42 శిబిరాలు
20 మెడికల్ యూనిట్లు.. 15 అంబులెన్స్ లు
జాతరలో వైద్యం మెరుగ్గా ఉండాలి
మంత్రి దామోదర రాజనర్సింహ
స్పాట్ వాయిస్, బ్యూరో: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు మేడారంలో 50 బెడ్లతో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. జాతరలో ఆరోగ్యశాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం అధికారులతో సమీక్షించారు. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమావేశంలో హెల్త్ సెక్రెటరీ క్రిస్ట్రినా, డీఎంఈ త్రివేణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మేడారంలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఆరు బెడ్లతో స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర పరిసరాల్లో మొత్తం 30 మెడికల్ క్యాంపులు, జాతరకు పోయే రూట్లలో మరో 42 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ క్యాంపులో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, అవసరమైన అన్ని రకాల మెడిసిన్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. 20 మొబైల్ మెడికల్ యూనిట్లు, 15 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జాతర వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, 15 బైక్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుకొని పేషెంట్లను వీలైనంత త్వరగా మెడికల్ క్యాంపులు, సమీపంలోని హాస్పిటళ్లకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. మెడికల్ క్యాంపుల్లో ట్రీట్‌మెంట్ చేశాక.. ఇంకా ఉన్నతస్థాయి వైద్యం అవసరమైతే ములుగు, ఏటూరునాగారం, పరకాల ఏరియా హాస్పిటల్స్‌కు, వరంగల్ ఎంజీఎంకు రోగులను తరలించి చేసి వైద్యం అందించాలని మంత్రి సూచించారు. జాతర ప్రారంభం కావడానికి రెండు వారాల ముందు నుంచే మెడికల్ క్యాంపులు, హాస్పిటల్ ప్రారంభించాలని ఆదేశించారు.
మేడారంలో 50 పడకల ఆస్పత్రి
RELATED ARTICLES
Recent Comments