Thursday, November 21, 2024
Homeతెలంగాణబీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్

బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్

స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్‌ నాయకులు కె.కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌గా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. సభలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమై పార్టీ విధివిధానాలు, అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి, సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments