వీఆర్ఏల క్రమబద్దీకరణకు లైన్ క్లియర్..
నేడు జీవో వెలువడే అవకాశం..!
స్పాట్ వాయిస్, హైదరాబాద్: వీఆర్ఏల క్రమబద్దీకరణకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆదివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్తో జరిగిన వీఆర్ఏల సమీక్షా సమావేశం ముగిసింది.విద్యార్హతలను బట్టి నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల్లో వీఆర్ఎలను ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. 61 ఏళ్లు దాటిన వీఆర్ఎల ఉద్యోగాన్ని వారసులకు ఇవ్వాలని నిర్ణయించింది.
Recent Comments