సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి మోతె కరుణాకర్ రెడ్డి
స్పాట్ వాయిస్, గణపురం: అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి మోతె కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని నగరంపల్లె గ్రామానికి చెందిన వంగ ధనంజయ్ కు రూ.32,500, భూక్య శిరీషకు రూ. 27,500 సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఈడబోయిన సంతోష్, సీనియర్ నాయకులు మాదాడి నారాయణరెడ్డి, ఆవుల రవి, తొట్ల రాజగోళ్ళ, వావిలాల మొగిలి, భాషవేణి బాలరాజు, ఈడబోయిన దేవేందర్, అజ్మీర్ రాజు, అజ్మీర సీతారాం మంగరాజు, భూక్య రమేష్, తిరుపతి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Recent Comments