Sunday, May 25, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఛీ..ఛీ.. వెదవల్లారా..

ఛీ..ఛీ.. వెదవల్లారా..

ఛీ..ఛీ.. వెదవల్లారా..
ఎంత పని చేశారు..
కుక్కను చంపి.. జింక మాసంగా అమ్మి..
స్పాట్ వాయిస్, డెస్క్: కేటుగాళ్లకు జేజమ్మల్లాటోళ్లు అనుకుంటా వీరు. ఈ మోసగాళ్ల చేసిన దారుణ పని వింటే మీ నోట అదే మాట వస్తుంది. ఇంతకీ వీరేం చేశారనుకుంటున్నారా..? కుక్కను చంపి.. జింక మాంసమంటూ విక్రయించారు. మేక మాంసం అయితే గుర్తుపడతారు. గుర్రె మాంసం అయితే తెలిసిపోతుంది. డబ్బులు సంపాదన కోసం ఓ పెంపుడు కుక్కను చంపి జింక మాంసం అంటూ అమ్మేశారు.చుట్టూ అడవులు ఉండే సరికి నిజంగానే జింక మాంసం అనుకుని మాంస ప్రియులు ఎగబడి ఎగబడి కొన్నారు. ఈ ఘోర ఘటన నిర్మల్ జిల్లా క్ష్మణ్‌చందానగర్‌లో చోటు చేసుకుంది. పెంపుడు కుక్క మిస్ అయ్యే సరికి దాని యజమానికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఇదిలా ఉంటే ఈ ఘటన తెలిసిన తర్వాత కుక్క మాంసం కొని తిన్నోళ్ల పరిస్థితి ఊహించుకుంటే దారుణంగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments