Tuesday, April 22, 2025
Homeలేటెస్ట్ న్యూస్కేటీపీపీ లో కోటి రూపాయల సొత్తు మాయం..!

కేటీపీపీ లో కోటి రూపాయల సొత్తు మాయం..!

కేటీపీపీ లో కోటి రూపాయల సొత్తు మాయం..!

తలలు పట్టుకున్న అధికారులు..

అంతర్గతoగా కమిటీ వేసి విచారణ..

 

 స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ లోని కేటీ పీపీ లో భారీగా సొత్తు మాయం అయినట్లు సమాచారం. మాయమైన సొత్తు విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. తెలిసిన సమాచారం ప్రకారం.. కేటీపీపీ లోని స్టోర్ రూంలో ఉన్న కాపర్ భారీగా మాయం అయినట్లు తెలిసింది. స్టోర్ లో విలువైన సామాగ్రి కనిపించడం లేదని జెన్కో సోమవారం గుర్తిoచి విషయన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వారి ఆదేశాలమేరకు విషయం బయటికి పోక్కకుండా.. జెన్ కో అధికారులు అంతర్గతo గా కమిటీ వేసి విచారణ చేపడుతున్నారు. సొత్తు మాయం విషయం సీఎండీ వరకు వెళ్లడం తో జెన్ కో అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫుల్ సెక్యూరిటీ ఉండే జెన్ కో నుంచి కోటి రూపాయల విలువైన సొత్తు మాయం కావడం విస్మయం కలిగిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments