Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్..

లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్..

లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్..

డ్యూటీలో చేరాల్సిందే..

12pm డెడ్ లైన్..

కొత్త వారిని తీసుకుంటాం 

ప్రభుత్వం ఫైనల్ హెచ్చరిక జారీ

స్పాట్ వాయిస్, హన్మకొండ: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తుంది. 15 రోజులుగా జేపీఎస్​ల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎస్​ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమ్మె చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే గత సోమవారం వరకు వారికి గడువు ఇచ్చారు.

తుది దఫాగా శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు. ఆలోగా విధుల్లో చేరిన వారిని కొనసాగించాలని.. గైర్హాజరైన వారిని తొలగించాలని సూచించారు. విధులకు హాజరైన వారి జాబితాను మండల పరిషత్‌ అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కలెక్టర్లకు పంపించాలని సూచించారు.

తొలగించడమే

విధులకు హాజరుకాని వారిని తొలగించి, వారి స్థానాలను ఖాళీలుగా చూపించి.. వెంటనే నియామకాలు చేపట్టి కొత్త జేపీఎస్​లను తీసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల రోస్టర్‌ ప్రాతిపదికన నియామకాలు జరపాలని నిర్దేశించారు. స్థానికంగా ఉంటూ, డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్‌ పరిజ్ఞానం గల వారికి.. జేపీఎస్​లుగా ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. గతంలో జేపీఎస్ పరీక్షలు రాసిన వారికి ప్రాధాన్యమిస్తారు. నియామకాలపై గ్రామ పంచాయతీలకు ఎంపీడీవోలు సమాచారం ఇస్తారు. దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి, నియామకాలను ఆమోదిస్తూ తీర్మానిస్తారు.కలెక్టర్లు ఆ జాబితాను పరిశీలించి.. ఆదివారం ఖరారు చేస్తారు. ఎంపికైన వారికి సోమవారం నియామకపు ఉత్తర్వులిస్తారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments