Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుమన్ కీ బాత్ ఓ అద్భుతం..

మన్ కీ బాత్ ఓ అద్భుతం..

మన్ కీ బాత్ ఓ అద్భుతం

 – విజయవంతంగా 100 వ ఎపిసోడ్ 

– దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన కార్యక్రమం 

బీజేపీ నేత గంట రవికుమార్

స్పాట్ వాయిస్, వరంగల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన మన్ కీ బాత్ అద్భుతమని, దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమని వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ నేత గంట రవికుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ శివనగర్ లోని బూత్ 158 లో తన స్వగృహంలో స్థానికులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 100 కోట్ల శ్రోతలకు చేరువై రికార్డు సృష్టించిందన్నారు. 21 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించగా, 41 కోట్ల మంది అప్పుడప్పుడు వీక్షించారని ప్రసార భారతి సీఈవో గౌరవ ద్వివేది, ఐఐఎం రోహతక్ డైరెక్టర్ ధీరజ్ పి. శర్మ వెల్లడించారని తెలిపారు. మన్ కీ బాత్ ను ఆల్ ఇండియా రేడియో కు చెందిన 500 కు పైగా ప్రసార కేంద్రాలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు . ఆదివారం మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ లు పూర్తి చేసు కుందని వెల్లడించారు. అలాగే ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియా, బర్మీస్, బలూచి అరబిక్, దరి, స్వాహిలి వంటి 11 విదేశీ భాషల్లో ప్రసారం జరగడం విశేషమన్నారు. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు. మోడీ చేపట్టిన అభివృద్ధి పథకాలే రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments