550 మందికి తండ్రయ్యాడు..
ఇక చాలు నాయానా అన్న కోర్టు..
స్పాట్ వాయిస్, డెస్క్: వీడు మగాడ్రా బుజ్జి.. నిజమే.. నేను అనడం కాదు.. ఈ వార్త చదివితే మీరు కూడా అంటారు. నెదర్ ల్యాండ్స్ కు చెందిన వ్యక్తి 550 మందికి తండ్రి అయ్యాడు. ఆశ్చర్యంగా ఉందా..! ఇది నిజం.. ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ (41) అనే వైద్యుడు 2007 నుంచి అతడు వీర్యదానం చేస్తున్నాడు. జానథన్ ఇప్పటివరకూ 13 సంతాన సాఫల్య కేంద్రాల్లో వీర్యదానం చేసినట్టు తేలింది. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. వీర్యదానం ద్వారా జొనథన్ వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని 2017లోనే తెలిసింది. దీంతో నెదర్లాండ్స్ యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో అతడిని ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ అతడిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. భవిష్యత్‌లో రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు తలెత్తకుండా చూడటం, పుట్టిన సంతానం మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నెదర్లాండ్స్ యంత్రాంగం ఈ నిబంధనలు రూపొందించింది. అయినా కూడా అతడు అక్రమంగా వీర్యం దానం చేసినట్లుగా తెలుస్తోంది. అంతమందికి తండ్రి అయిన వ్యక్తిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇకపై స్పెర్మ్ డొనేషన్ చేయకూడదంటూ తీర్పునిచ్చింది. అలాగే జాకబ్ కు 1,00,000 యూరోలు భారత్ కరెన్సీలో రూ.90 లక్షలకు పైగా జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఇంతకి ఇతడిపై కేసు ఎలా నమోదైందనుకుంటున్నారా..? అతడి వీర్యం ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళా కోర్టును ఆశ్రయించింది.
వీడు మగాడ్రా బుజ్జి..
RELATED ARTICLES
Recent Comments