Sunday, April 6, 2025
Homeలేటెస్ట్ న్యూస్మావోయిస్టుల విధ్వంసం..

మావోయిస్టుల విధ్వంసం..

మావోయిస్టుల విధ్వంసం..
జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు పేల్చివేత..
10 మంది జవాన్లు, డ్రైవర్ మృతి
స్పాట్ వాయిస్,  మహదేవపూర్:  ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. భద్రతాబలగాలపై ఐఈడీ దాడులకు దిగగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దంతేవాడలోని అరన్ పూర్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఐఈడీ మందు పాతర పెట్టి పేల్చేశారు. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో 10 మంది పోలీసులు కాగా.. ఒకరు డ్రైవర్ ఉన్నారు. దాడి జరిగిన సమాచారం అందగానే అధికారులు సహాయక చర్యలు చేపట్టార. భారీ సంఖ్యలో భద్రతా సిబబ్బందిని మోహరించారు. మరణించిన జవాన్లను డిఫెన్స్ రీసెర్చ్ కు టీంకు చెందిన వారీగా గుర్తించారు. అరన్ పూర్ లో మవోయిస్టుల ఉనికి ఉందన్న పక్కా సమాచారంతో డీఆర్జీ బృదం.. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. జవాన్లు పహారా ముంగించుకుని తిరిగి తమ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతరతో మినీ బస్సును పేల్చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments