Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్అధికార పార్టీ నేతల్లో అలజడి..

అధికార పార్టీ నేతల్లో అలజడి..

అధికార పార్టీ నేతల్లో అలజడి 

అలాంటి వారిని ప్రజా కోర్టులో శిక్షిస్తాం.. 

మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ హెచ్చరికలు..

ఏటూరు నాగారంలో వాల్ పోస్టర్ల కలకలం

స్పాట్ వాయిస్, ములుగు: అధికార పార్టీ నేతల అక్రమాలను సహించేది లేదని, అలాంటి వారికి ప్రజా కోర్టులో శిక్షలు తప్పవని సీపీఐ మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ కమిటీ స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో సోమవారం ఏటూరు నాగారంలో మావోయిస్టు పార్టీ వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. కొంత మంది అధికార పార్టీని అడ్డంపెట్టుకుని  ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని  మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ కమాండర్ ఐద్రు, కామ్రేడ్ వెంకటేశ్ లేఖలో ఆరోపించారు. కొందరు పోలీస్ ఇన్ ఫార్మర్లుగా వ్యవరిస్తున్నారని, అలాంటి వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని. ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని పలువురు అధికార పార్టీ నేతలను హెచ్చరిస్తూ వాల్ పోస్టర్లలో కమిటీ పేర్కొంది. ఇకపోతే ఫారెస్ట్ అఫీసర్లు అమాయక ప్రజలపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పోలీసుల కన్నా ఎక్కువ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఫారెస్టు అధికారులు పద్ధతులు మార్చుకుంటే మంచిదన్నారు. అడవుల్లో పోలీసులు కూంబింగ్ ఆపాలని, లేకపోతే బీఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుల నుంచి జిల్లా నాయకుల వరకు ఎవ్వరినీ వదిలి పెట్టమని లేఖలో స్పష్టం చేశారు. దీంతో ములుగు జిల్లా అధికార పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. కాగా, మావోయిస్టు వాల్ పోస్టర్లపై జిల్లా పోలీసు అధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments