Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్అన్ని సేవలు ఒకే వేదికగా

అన్ని సేవలు ఒకే వేదికగా

అన్ని సేవలు ఒకే వేదికగా…

విద్య వ్యవస్థ లో స్పెషల్ సర్వీస్..

వరంగల్ యువకుడి కొత్త ఆలోచన..

సంస్థల కలల సాకారం కోసం వినూత్న ప్రయత్నం

స్పాట్ వాయిస్, డెస్క్ :  మార్పు అనివార్యం. కాలం తో పరుగు ప్రస్తుత పరిస్థితి లో అత్యవసరం. పోటీ పెరిగింది.., అవకాశాలు తగ్గుతున్నాయి. విద్య వ్యవస్థ దేశ భవితకు పునాది.., రేపటి తరానికి బాట. అలాంటి వ్యవస్థ లో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు జరుతున్నాయి. పోటీతత్వం నిత్యకృత్యం గా దూసుకెళ్తున్న విద్యార్థులు భవిష్యత్ ను బంగారుమయంగా మలుచుకుంటున్నారు. సాంకేతికత విద్య పై పూర్తి పట్టు సాధించాలానే ఆతృత అందరికి పెరిగింది. అందుకే పిల్లలకి ప్రాథమిక విద్య నుండే తీర్చిదిద్దే బాధ్యతలను ప్రైవేటు విద్యా సంస్థలు తమ భుజాలపై వేసుకుంటున్నాయి. ఆధునిక విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్య సంస్థ లు తమను తాము మలచుకుంటూ.., మార్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.

ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలకు ది బెస్ట్.. కోసం అహర్నిశలు ఆలోచన జరుగుతోంది.
ప్రతి విషయంలో విద్యా సంస్థల యాజమాన్యాలు వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా ఆరా తీసుకోవల్సిన పరిస్థితులున్నాయి. ఇలాంటి ప్రయత్నాల్లో తొలి అడుగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలూ లేకపోలేదు. ప్రైవేటు విద్యా సంస్థలకు అన్ని సేవలు ఒకే వేదిక ద్వారా అందించేందుకు ప్రత్యేకంగా ఓ కంపెనీ స్టార్ట్ చేశాడు వరంగల్ యువకుడు.

ప్రైమరీ స్కూల్ టు డీమ్డ్ యూనివర్శిటీ వరకు

ప్రతి ఒక్క విద్యా సంస్థకు అవసరాలన్నింటిని తాను ఏర్పాటు చేసిన www.myverkoper.com ద్వారా సేవలందించేందుకు వరంగల్ కు చెందిన నితిన్ పాలడుగుల నూతన కంపెనీ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ద్వారా ఆన్ లైన్ లోనే విద్యా సంస్థలు తమ సేవలను వినియోగించుకోవచ్చంటున్నారు నితిన్. అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి చేస్తున్న ఈ ప్రయత్నం తెలంగాణ గడ్డ మీదుగా ప్రారంభించారాయన. పీజీ కంప్లీట్ చేసిన నితిన్ తన ఆలోచనలను రంగరించి వినూత్నంగా సర్వీస్ అందించేందుకు ఓ వేదిక కావాలని భావించారు. ఇందుకు తగ్గట్టుగా అన్ని విధాలుగా సిద్దం చేసుకున్న ఆయన ఇటీవల myverkoper కంపెనీని ప్రారంభించారు. ఇందులో ఎడ్యూకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సెక్యూరిటీ నుండి హై సెక్యూరిటీ ఉన్న సిస్టమ్స్ వరకు, క్లారికల్ స్టాఫ్ నుండి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వరకు, ఫస్ట్ క్లాస్ టీచర్ నుండి డీమ్డ్ యూనివర్శిటీ స్టూడెంట్స్ కు బోధించే ప్రొఫెసర్ల వరకు ఇలా విద్యా వ్యవస్థలో అవసరమైన ప్రతి రంగానికి సంబంధించిన వాటిని అందించేందుకు సిద్దంగా ఉన్నానని నితిన్ పాలడుగుల వివరించారు. క్లాస్ రూమ్స్ లో అవసరమైన బ్లాక్ బోర్డ్ నుండి డైనింగ్ హాల్ లో అవసరం ఉండే మెటిరియల్ వరకు ప్రతిది కూడా తన కంపెనీ ద్వారా డీల్ చేసుకోవచ్చని చెప్తున్నారు. విద్యా సంస్థల్లో యూనిఫామ్స్, బ్యాడ్జెస్, టైస్, టెక్ట్స్ బుక్స్, అడ్మినిస్ట్రేషన్ పరంగా అవసరమయ్యే వైట్ పేపర్ నుండి ప్రింటర్ వరకు యాజమాన్యాలు సదరు షాపులకు వెల్లి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనివల్ల ఆయా విద్యా సంస్థలు ప్రత్యేకంగా వ్యాపార వర్గాల గురించి వివరాలు సేకరించి తమకు అవసరమైనవి పర్చేజ్ చేసుకుంటున్నాయి. అయితే ఇక నుండి అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేస్తూ విద్యా సంస్థలకు అవసరమయ్యే ప్రతి వస్తువును, ప్రతి ఎంప్లాయిని తమ కంపెనీ ద్వారా పొందే విధంగా కార్యాచరణ తయారు చేశామన్నారు నితిన్ పాలడుగుల. ఇందుకోసం విద్యా సంస్థలు తమ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వారికి ఏఏ సేవలు అవసరమో అందుకు సంబంధించిన వాటిని వారికి అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత తమదేనని కంపెనీ ఫౌండర్ నితిన్ పాలడుగుల చెప్తున్నారు.

myverkoper సంస్థ ద్వారా అందించే సేవల వివరాలివే…

*Books & Worksheets,
E-Learning

*Assessment Solutions

*Olympiad Exams Training & Development

*Career Guidance & Counselling services

*Newspapers & Magazines

*Uniforms Shoes, Bags & Backpacks

Costumes & Fancy Dresses

* Stationery
Lunch Boxes, Bottles & Flasks

*Furniture

*Decor & Furnishings

*Lab Supplies

*Student Projects

*Sports & Play
Toys & Games

*Electronics

*Software Solutions

*Music & Band Instruments

*Awards & Certificates

*Housekeeping & Cleaning Supplies
Personal Hygiene & Care

*Recruitment & Staffing

*Tours, Excursions & Camps

*Event Management

*Fresh Vegetables & Fruits

Food & Beverages

*Packaged Drinking Water Services

*Vehicles & Transportation

*Loans & Finances

*Business Planning & Management

*Computer & Laptop Repair Services

*Uniform Tailoring Services

*House Keeping Services

*Canteen & Catering Services

*Digital Printing Services

*Digital Marketing

*Computer & Networking Solutions

*Telecommunication Services

*Building & Construction Supplies

*Lifts & Escalators

*Grills, Gates & Fences

*Safety Equipment & Prevention Products

ఈ రంగాల్లో myverkoper సంస్థ సేవలందించేందుకు రంగం సిద్దం చేసుకుంది. Email Id: we@myverkoper.com ద్వారా కూడా మెయిల్ చేసినట్టయితే స్పందిస్తామని నితిన్ పాలడుగుల తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments