Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి

వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి

2వ తేదీ నుంచి 15 వరకు పాదయాత్ర
స్పాట్ వాయిస్, నర్సంపేట: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద గతేడాది నవంబర్ 28న షర్మిల అరెస్ట్‌తో పాదయాత్ర నిలిచిన విషయం తెలిసిందే. ఈనెల 25న తిరిగి పాదయాత్ర నిర్వహించుకోవడానికి సీపీకి వైఎస్ఆర్టీపీ నేతలు దరఖాస్తు చేశారు. అయితే వచ్చే నెల 2 నుంచి 18 వరకూ పాదయాత్రకు సీపీ రంగనాథ్ అనుమంతించారు. ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్ర చేయాలని సూచించారు. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాస్పదవాఖ్యలు చేయవద్దని కండీషన్లు పెట్టారు. ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించవద్దంటూ అనేక నిబంధనలతో పాదయాత్రకు అనుమతినిచ్చారు. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హన్మకొండ, కాజీపేట ఘన్ పూర్, జఫర్ గఢ్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల , పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments