Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుహామీలను మర్చిన టీఆర్ఎస్ సర్కారు

హామీలను మర్చిన టీఆర్ఎస్ సర్కారు

హామీలను మర్చిన టీఆర్ఎస్ సర్కారు
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్
మామునూరు ఎయిర్ పోర్ట్ ను సందర్శించిన బీజేపీ శ్రేణులు

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: తెలంగాణ ఉద్యమ కాలంలో ఎయిర్ పోర్ట్ రావాలని ఉద్యమం చేసిన నాయకులు రాష్ట్రం ఏర్పడిన తరువాత హామీలను మర్చారని మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఆరోపించారు. ఆదివారం స్థానిక నాయకులతో కలిసి మామునూరు ఎయిర్ పోర్ట్ ను కొండేటి శ్రీధర్ సందర్శించారు. అనంతరం 43 డివిజన్ అధ్యక్షుడు మల్లాడి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండేటి శ్రీధర్ మాట్లాడారు. మామునూరులో ఎయిర్ పోర్టుకు సంబంధించి ఏడేళ్ల క్రితం ప్రైవేట్ రైతుల భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసిందని, అయితే ఈరోజు వరకు రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా వారిని ఇబ్బంది పెడుతోందన్నారు. సర్వే చేసి కేంద్రానికి అప్పగించకుండా తెలంగాణ సర్కారు కాలయాపన చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు సుడిగాలి పర్యటన చేస్తున్నారే తప్ప రైతులకు ఏం చేయట్లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సర్వే చేసి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలి డిమాండ్ చేశారు. సమావేశంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి కుసుమ సతీష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహంకాళి, జిల్లా ఇన్ చార్జి ప్రభాకర్, సీనియర్ నాయకులు జలగం రంజిత్, ఉప్పల శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments