Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుహన్మకొండ జిల్లా సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడిగా అబ్బు ప్రకాష్ రెడ్డి

హన్మకొండ జిల్లా సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడిగా అబ్బు ప్రకాష్ రెడ్డి

హన్మకొండ జిల్లా సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడిగా అబ్బు ప్రకాష్ రెడ్డి
ప్రజాప్రతినిధులు, నాయకుల శుభాకాంక్షలు
స్పాట్ వాయిస్, హన్మకొండ : శాయంపేట మండలం పెద్దకోడెపాక సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి హన్మకొండ జిల్లా సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం హన్మకొండ జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిధిలోని సర్పంచ్ ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని సర్పంచ్ లంతా ఏక్రగీవంగా జిల్లా ఫోరంను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అబ్బు ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కత్తి దేవేందర్, కార్యదర్శిగా రవీందర్ రెడ్డి, కోశాధికారిగా బూరుగుల రామారావు ఎన్నికైయారు. ఈ సందర్భంగా అబ్బు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని సర్పంచ్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments