మంత్రి వర్గ విస్తరణలో కోదండరాం ఛాన్స్..
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఉద్యమ నేత..
స్పాట్ వాయిస్, బ్యూరో: విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుత మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో ఆయనకు కేబినెట్‌లో ఛాన్స్ ఫిక్స్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కీలకమైన విద్యాశాఖ సీఎం వద్దే ఉంది. విద్యాశాఖకు విద్యార్థుల సమస్యలు, పోరాటాలపై అనుభవం ఉన్న ప్రొఫెసర్ కోదండరాం అయితే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.
ఢిల్లీలో సీఎం..
ప్రస్తుతం సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ముందు మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ నియామకంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలు ఉన్నాయి. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాలపై అధిష్టానంతో చర్చి.. నియమకాలు, కేబినెట్ విస్తరణ చేయనున్నారు. ఇక కోదండరాంకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉండడంతోనే.. సుప్రీంకోర్టు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నా.. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
ఉద్యమ నేత.. కాంగ్రెస్ కు మద్దతు..
రాష్ట్ర మంత్రి వర్గంలో ప్రస్తుతం సీఎం సహా 12 మంది మాత్రమే ఉన్నారు. విస్తరణలో మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కోదందరాం కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీచేసిన కాంగ్రెస్ ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు.
Recent Comments