సభ రోజే సత్తన్నకు షాక్..
ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో భారీగా చేరికలు
కండువా కప్పి ఆహ్వానించిన వెంకటరమణారెడ్డి
సంక్షేమ పథకాలను మెచ్చే టీఆర్ఎస్ లో చేరుతున్నారని వెల్లడి
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సభ రోజే భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శుక్రవారం ఉదయం నియోజకవర్గ పరిధి మొగుళ్లపల్లి మండలానికి చెందిన 100 మందికి పైగా కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు హైదరాబాద్ లో టీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చే పలు పార్టీల నుంచి తెరాస లో చేరుతున్నారన్నారు. పార్టీ శ్రేణులకు వారిలోమొగుళ్ళపల్లి మండలం మెట్లపల్లి కి చెందిన గండ్ర సత్తన్న యువసేన మండల పార్టీ యూత్ అధ్యక్షుడు గజ్జి రాజ్ కుమార్, మొగుళ్లపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చిలుకమరి శ్రీనివాస్, మండల కోశాధికారి లడే రాజు, మెట్లపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కూరి చంద్రమౌళి, గజ్జి శ్రీను, కోటగిరి జితేందర్, రాసమల్ల రవి, గూడెపు కిరణ్, జనగాం శ్రీనివాస్, జనగాం నాగార్జున, కొమ్రోజు రాజు, రజక సంఘం యూత్ ప్రెసిడెంట్ కొమ్రోజు రాజు, ఎస్సీ సెల్ విలేజ్ ప్రెసిడెంట్ గూడెం కిరణ్, చేనేత కార్మిక సెల్ ప్రధాన కార్యదర్శి మోత్కూరి చంద్రమౌళి, యాదవ సంఘం కన్వీనర్ గజ్జి శీను తోపాటు వంద మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ను వీడి తెరాస లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జోరిక సదయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు, రైతు సమన్వయ కమిటీ జిల్లా డైరెక్టర్ దండ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచులు మోతె ధర్మారావు, ఏకంబ సుగుణ రామారావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మంద సుధాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, నరసింహారెడ్డి రాచమల్ల రాజేష్, యూత్ అధ్యక్షుడు లోనే శివాజీ, పాల రవి, జనే రాజు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments