వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్
షర్మిళ పర్యటనను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వైఎస్ఆర్ టీపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం వైఎస్ షర్మిల పర్యటించి జిల్లాలో గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజలను, కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యటించినందుకు ముందుగా ఆయన షర్మిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎప్పుడు వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి సమస్యపై పార్టీ పోరాడుతుందని, ప్రజల్లో ఇంకా నమ్మకం పెంచుతామని, జిల్లాలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, జిల్లా పోలీసు బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్సాటీపీ ప్రజలకు అండగా ఉంటుంది..
RELATED ARTICLES
Recent Comments