Tuesday, September 24, 2024
Homeజిల్లా వార్తలురక్తదానంతో ప్రాణదానం...

రక్తదానంతో ప్రాణదానం…

నాలుగో బెటాలియన్ లో రక్తదానం శిబిరం
రక్తదానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడొచ్చు
బెటాలియన్ కమాండెంట్లు డి.శివప్రసాద్ రెడ్డి, పీజేపీసీ చటర్జీ
స్పాట్ వాయిస్, మామునూరు : నాలుగో బెటాలియన్ మామునూరు క్యాంపు లో 75 వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని “రెడ్ క్రాస్ సొసైటీ” వరంగల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ కు చెందిన అధికారులు , సిబ్బంది, మెడికల్ స్టాప్ తో కలిసి 4వ బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి, ఐదో బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ చటర్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రెడ్ క్రాస్ ప్రతినిధి డాక్టర్ J. కిషన్ రావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చన్నారు. సంవత్సరానికి మూడు సార్లు సురక్షితంగా రక్తదానం చేయవచ్చునని, డాక్టర్ల పర్యవేక్షణలో తగు సూచనలు ద్వారానే రక్తదానం ఇవ్వాలన్నారు. 4వ బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రక్త దానం చేయడం మన అదృష్టమని, సంవత్సరానికి బెటాలియన్ క్యాంపు ఆవరణలో రెండు, మూడు సార్లు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సమాజసేవలో పాల్గొంటున్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 100 మంది పోలీసు అధికారులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఐదో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎన్.పెద్ద బాబు, రెడ్ క్రాస్ ప్రతినిధి డాక్టర్ జె. కిషన్ రావు, అసిస్టెంట్ కమాండెంట్ డి. నరేందర్ రెడ్డి, రాంబాబు, వేణుగోపాల్ రెడ్డి, ఐదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీనివాస రావు, రమణ, సోమని, ఆర్ ఐ లు శ్రీనివాసులు, శోభన్ బాబు, అన్నయ్య, కార్తీక్, పురుషోత్తం రెడ్డి, దయ శీల, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, అశోక్, యూనిట్ మెడికల్ ఆఫీసర్ విజయ్ కుమార్, లతా సంగి, ప్రియదర్శిని, ఫార్మసిస్ట్ రమేష్ సురేష్, మెడికల్ స్టాప్, మినిస్టీరియల్ స్టాఫ్, అసోసియేషన్ సభ్యులు, నాలుగో తరగతి ఉద్యోగులు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments