మృతురాలి కుటుంబానికి పరామర్శ
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బండి సదానందం, శీను తల్లి బండి సారక్క అనారోగ్యంతో మరణించగా ఆదివారం నిర్వహించిన దశ, దిన కర్మ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సారక్క చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, బీసీ సెల్ మండల నాయకుడు నల్లగొండ సుధాకర్, నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు నూకల మర్రి మురళి, మేడపలి గ్రామ పార్టీ అధ్యక్షుడు వంగర వెంకన్న, ఆసరవెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు జలగం రాజు, బత్తిని మల్లయ్య, కొమురారెడ్డి, కోల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి పరామర్శ
RELATED ARTICLES
Recent Comments