భర్త ఇంటి ఎదుట భార్య నిరసన
స్పాట్ వాయిస్, నర్సంపేట(ఖానాపూర్) : భర్త ఇంటి ఎదుట భార్య నిరసన తెలిపిన ఘటన ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో మంగళవారం జరిగింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన మక్కా వినోద్, ఎల్తీ రవళి మూడేళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం రవళి తల్లిదండ్రులు వినోద్ కు పెళ్లికి సంబంధించిన కట్నకానుకలను కూడా అందజేశారు. కొంతకాలం పాటు సాఫీగా సాగిన కాపురంలో చిన్న చిన్న గొడవ మొదలై పెద్దవిగా మారాయి. తనకు భార్య వద్దనడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేశారు. అయినా ఆమెను కాపురానికి తీసుకోకపోవడంతో మంగళవారం భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా వినోద్ ఇంటికి వద్ద నిరసన తెలుసుతుండగానే వినోద్ కుటుంబసభ్యులు ఇంటి నుంచి జారుకున్నారు.
Recent Comments