బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ
స్పాట్ వాయిస్,, వర్ధన్నపేట : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ‘హర్ గర్ మే తిరంగా..’ నినాదంతో ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో యాత్ర ఇన్ చార్జిలు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పోశాల సురేష్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు కర్క సోమిరెడ్డి కు జాతీయ జెండాలను అందించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మోడెం కుమారస్వామి, జిల్లా ప్రచార కార్యదర్శి పిట్టల రాజు, మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెళ్లి కృష్ణమూర్తి, మండల యువమోర్చా ఉపాధ్యక్షుడు మహంత్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ
RELATED ARTICLES
Recent Comments