Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుతెలంగాణను ఎంచుకోవడం అదృష్టం

తెలంగాణను ఎంచుకోవడం అదృష్టం

తెలంగాణను ఎంచుకోవడం అదృష్టం
మోడీ సభను విజయవంతం చేయాలి
బీజేపీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ చార్జి దేవకి వాసుదేవ రావు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోవడం మనందరి అదృష్టంగా భావించాలని బీజేపీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ చార్జి దేవకి వాసుదేవ రావు అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని లక్ష్మి గార్డెన్స్ లో ఆదివారం బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ కన్వీనర్ ముత్తిరెడ్డి కేశవ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి దేశంలోని 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులంతా హాజరుకానున్నారని, విజయవంతం చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకుని వస్తూ ప్రపంచ దేశాల దృష్టిని దేశం వైపు మరల్చిన మహానాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదాన్ని నిజం చేస్తూ మైనార్టీ వర్గానికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్, ప్రస్తుతం షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఆదివాసీ మహిళా నాయకురాలు ద్రౌపది ముర్మ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి సమావేశం చాలా రోజుల తరువాత నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం, ఆ తరువాత జరగబోయే నరేంద్రమోడీ బహిరంగ సభ అంటే టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు కేటీఆర్ కు నిద్ర పట్టడం లేదన్నారు. రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి వస్తే మా పని ఏమవుతుందో అన్న భయం వాళ్లలో మొదలైందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షలపైచిలుకు ప్రజలు హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంత చేసే చర్యలు మనవంతుగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెండో డివిజన్ కార్పొరేటర్ రవి నాయక్, వర్ధన్నపేట మండలం అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి, చీటూరి రాజు, రాష్ట్ర నాయకుడు చీటూరి అశోక్, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి తక్కళ్లపల్లి శ్రీదేవి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి బండి సాంబయ్య యాదవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు మహంకాళి, జిల్లా ఇన్ చార్జి బన్న ప్రభాకర్, సీనియర్ నాయకుడు జలగం రంజిత్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు రఘునారెడ్డి, రాధారపు శివకుమార్, నాంపెల్లి యాకయ్య, జిల్లా కోశాధికారి పగడాల రాజ్ కుమార్, జిల్లా కార్యాలయ కార్యదర్శి కంది క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments