Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుకేసీఆర్​ పాలనపై యువత అసహనం

కేసీఆర్​ పాలనపై యువత అసహనం

కేసీఆర్​పాలనపై యువత అసహనం
కమలం వైపు.. యువకుల చూపు..
ఎన్నికలెప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
బీజేపీలో పలువురి చేరిక
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: కేసీఆర్​పాలనపై విసుగు చెందిన యువత భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులవుతోందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే వివిధ పార్టీలకు చెందిన యువకులు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున కమలం పార్టీలో చేరుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంలో మండలంలోని ధర్మరావు పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు రేవూరి సమక్షంలో బీజేపీలో చేరగా, ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ ఎస్​ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, కేసీఆర్​పనితీరుపై విసుగు చెందిన యువత బీజేపీ వైపు చూస్తోందన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి వారి స్థాయికి తగ్గట్టుగా పదవులు దక్కుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు, మండల ఇన్​చార్జి నల్లబెల్లి సుదర్శన్, పార్టీ మండల అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు బొట్ల పవన్, వల్లే రమేష్, ఉపాధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య, వేముల రాజు, శక్తి కేంద్ర ఇన్​చార్జి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments