ఢిల్లీకి వైఎస్సార్ టీపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్
రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రికి కలవనున్న వైఎస్ షర్మిల
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : వైఎస్సార్ టీపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ ఢిల్లీలో శుక్రవారం ఉదయం10 గంటలకు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై, అవినీతి ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్న షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెడుతున్న కేసుల గురించి రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వివరించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై, విభజన హామీ ప్రకారం తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి షర్మిల మాట్లాడనున్నారు. కాగా, పార్టీ అధినేత షర్మిల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కిషన్ తెలిపారు.
ఢిల్లీకి వైఎస్సార్ టీపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్
RELATED ARTICLES
Recent Comments