Friday, November 22, 2024
Homeటాప్ స్టోరీస్చంచల్​గూడ జైలులో వైఎస్​ షర్మిల 

చంచల్​గూడ జైలులో వైఎస్​ షర్మిల 

చంచల్​గూడ జైలులో వైఎస్​ షర్మిల 

14రోజుల రిమాండ్​

స్పాట్ వాయిస్, హైదరాబాద్ :పోలీసులపై చేయి చేసుకున్నారనే కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ టీ పీ అధినే త్రి వైఎస్​ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్​ విధించింది. ఈ కేసులో ఆమెకు 14రోజులు రిమాండ్​ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె బెయిల్​ పిటిషన్ వేయగా.. విచారణ రేపటికి వాయిదా వేశారు. దీంతో ఆమెను చంచల్​గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

ఎస్సై తాకే ప్రయత్నం చేశాడు..

షర్మిల తరపున వాదించిన న్యాయవాది.. నోటీసులివ్వకుండానే షర్మిలను అడ్డుకున్నారని కోర్టుకు వివరించారు. హైకోర్టు చెప్పినా షర్మిలను బయటికు వెళ్లనివ్వట్లేదని చెప్పారు.షర్మిల విషయంలో పోలీసులు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని కోర్టులో వాదించారు. షర్మిలను ఎస్సై తాకే ప్రయత్నం చేశారని, పోలీసులు ఆమె.. చేయి విరిచే ప్రయత్నం చేశారని కోర్టుకు వివరించారు. ఆ క్రమంలోనే షర్మిల పోలీసులు తోసేశారని అన్నారు.పోలీసుల తరపున వాదించిన న్యాయవాది.. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments