ఎన్ వైకేఎస్ నర్సంపేట బ్లాక్ కోఆర్డినేటర్ ఏషబోయిన పురుషోత్తం
స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట టౌన్, రూరల్, ఖానాపూర్ వ్యాప్తంగా ఉన్న 18-29సంవత్సరాల మధ్య వయస్సు యువతీ,యువకులు యువజన సంఘాలుగా ఏర్పడి సభ్యులుగా నమోదు చేసుకోవాలని ఎన్ వైకేఎస్ నర్సంపేట బ్లాక్ కో-ఆర్డినేటర్ ఏషబోయిన పురుషోత్తం కోరారు. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వశాఖ ( నెహ్రూ యువ కేంద్ర సంఘటన్) ద్వారా గ్రామాల్లో అనేక కార్యక్రమాలు యువజన సంఘాల ద్వారా నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగానే గ్రామంలోని యువతను యువజన సంఘం సభ్యులుగా చేర్చి, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS) లో చేరుస్తుందన్నారు. కాబట్టి యువతీయువకులందరూ 30వ తేదీ లోపున మొదటి విడతగా గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శి ద్వారా 15మంది సభ్యులకు తగ్గకుండా యూత్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. యూత్ అధ్యక్ష, కార్యదర్శులు ఫొటో, ఆధార్ కార్డ్ జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాలని చెప్పారు. దీనికి ఎలాంటి రుసుం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి వివరాలకు 809924575 లో సంప్రదించాలని సూచించారు.
యువజన సంఘాలు నమోదు చేసుకోండి
RELATED ARTICLES
Recent Comments