జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గణపురంలో బైక్ ఎన్ వోసీ గొడవ విషయంలో పురుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నిప్పాని శ్రావణ్ స్థానిక హోండా బైక్ షోరూం యజమాని మోతుకురి శ్రీనువాస్ వద్ద ఫైనాన్స్ లో ద్విచక్రవాహనం తీసుకున్నాడు. ఫైనాన్స్ మొత్తం చెల్లించి ఎన్ఓసీ తీసుకోవడానికి ఈనెల 10న వెళ్లగా.. ఫెనాల్టీ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో బైక్ షోరూం యజమాని శ్రీనివాస్ శ్రావణ్ ను కొట్టగా.. తనమామను ఎందుకు కొట్టావంటూ పెండ్యాల ప్రశాంత్ ప్రశ్నించాడు. ఈ గొడవపై గణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 11వ తేదీన పోలీసులు ఇంట్లో ఉన్న ప్రశాంత్, శ్రావణ్ ను స్టేషన్ తీసుకెళ్లారు. దీంతో గణపురం ఎస్సై ఉదయకిరణ్ విచారణ చేపట్టి వదిలేశారు. మరుసటి రోజు మళ్లీ పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పడంతో భయపడిన ప్రశాంత్ పురుగుల మందు తాగాడు. ముందుగా ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ కు పంపించారు. హన్మకొండ ఆదిత్య హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. రెక్కడాతే గాని డొక్కడని ఆ పేద కుటుంబం కొడుకు బతకాలని లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్న ఫలితం లేకుండా పోయింది.
ఎస్సై, బైక్ షోరూం యజమానిపై ఎస్పీకి ఫిర్యాదు..
తన కుమారుడి ఆత్మహత్యాయత్నానికి కారుకలైన గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్, హోండా షోరూం యజమానికి మోతుకురి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎస్పీ సురేందర్ రెడ్డికి ఫిర్యాదు ప్రశాంత్ తండ్రి చేశారు. తన కొడుకు ఆత్మహత్యకు యత్నించడానికి వీరి వేధింపులే కారణమని కన్నీటి పర్యాంతమయ్యాడు.
Recent Comments