Friday, November 22, 2024
Homeజిల్లా వార్తలుబిర్యానీలో పురుగులు..

బిర్యానీలో పురుగులు..

కస్టమర్ ఉరుకులు పరుగులు.. 
భూపాలపల్లిలో ఘటన..
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: మీరు బిర్యానీ తినాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త. తినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే.. పురుగులను తినే ఛాన్స్ ఉంది. నిజమేనండి.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ గ్రాండ్ రెస్టారెంట్‌లో వడ్డించిన బిర్యానీలో పురుగులు వచ్చాయంటూ కస్టమర్లు ఆందోళన చేపట్టారు. ఘటనతో ప్రముఖ రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని వెళ్లిన యువకులకు షాక్ తగిలినట్లు అయింది. భూపాలపల్లిలో రెస్టారెంట్లకు కొదవలేదు. అయితే ఆ గ్రాండ్ రెస్టారెంట్ బిర్యానీకి ఫేమస్ అని, బాగా ఆకలిగా ఉందని వెళ్లిన యువకులు బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. వేడివేడిగా పొగలు కక్కుతూ బిర్యానీ వచ్చింది. ఇంకేముంది తినేద్దామని మొదలుపెట్టేలోపు వారికి ఎందుకో బిర్యానీలో ఏదో తేడా కొడుతోందని అనిపించి తేరిపార చూడగా బిర్యానీలో పురుగులు తిరుగుతూ కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సదురు యువకులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రెస్టారెంట్ యాజమాన్యం తప్పు తమదే అని, అనుకోకుండా జరిగిందని సర్దిచెప్పడానికి ట్రై చేశారు. అది మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అని, ఇలాంటివి ముందుముందు జరగకూడదని సదురు వ్యక్తులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులకు విచారణ జరుపుతున్నారు. ఇకముందు ఏ రెస్టారెంట్ కు వెళ్లినా తినేముందు ఒక్కసారి ఫుడ్ ను చెక్ చేసి తినడం అలవాటు చేసుకోండి మరి. లేదంటే పురుగుల బిర్యానీనే గతి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments