Wednesday, April 9, 2025
Homeజిల్లా వార్తలుసేవాలాల్ స్ఫూర్తితో తండాల అభివృద్ధికి కృషి

సేవాలాల్ స్ఫూర్తితో తండాల అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట : సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో తండాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి సందర్భంగా భోగ్ భండారో కార్యక్రమాన్ని నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడారు. సేవలాల్ మహరాజ్ సామాజిక ఉద్యమకారుడిగా గిరిజన లంబాడాలను ఏకంచేసి గొప్ప సంస్కృతిని, జీవనవిధానాన్ని బోధించిన ఆధ్యాత్మిక గురువుగా చరిత్రలో నిచిపోయారన్నారు. వారి జీవితం నేటియువతకు స్ఫూర్తిదాయకమన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని తండాలకు సాగు, తాగునీరు, నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటుచేయడం, అన్ని తండాలకు రవాణా సౌకర్యం కోసం బీటీ రోడ్లను, సీసీ రోడ్లను ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పది శాతం రిజ్వేషన్లను కల్పించిందన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చొరవతో నర్సంపేట నియోజకవర్గానికి గిరిజన సైనిక్ స్కూల్, డిగ్రీ కళాశాలతో పాటు బాలికల కోసం హాస్టల్ ను తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గిరిజన లంబాడా నాయకులు, పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments