కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా రాత్రికి రాత్రి నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ని కాంగ్రెస్ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల ఇంద్రదేవ్, ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్ మండిపడ్డారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటన నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గం, మండలాల కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులను అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ఎంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ అంటే ఎందుకంత భయమన్నారు. గతంలో వడగండ్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రులను తీసుకొచ్చి వాగ్దానం చేశారని, కానీ నేటికీ పరిహారం అందలేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ములుకల మనిష్, యువజన కాంగ్రెస్ నాయకులు పంబీ వంశీకృష్ణ, చిప్ప నాగ, జన్ను మురళీ, మహమ్మద్ మున్న, నిమ్మలబోయిన శ్రీను, జెట్టి శ్రావణ్, బొంత రంజిత్, దేశి సాయి కిరణ్, మచ్చకంటి మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు ఎందుకంత భయం..?
RELATED ARTICLES
Recent Comments