Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలురోడ్డు పనుల్లో నాణ్యత ఏది..?

రోడ్డు పనుల్లో నాణ్యత ఏది..?

ఆగమాగంగా నల్లబెల్లి జగన్ తండా బీటీ రోడ్డు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: నల్లబెల్లి నుంచి జగన్ తండాకు నల్లబెల్లి చెరువు కట్టపై వేస్తున్న బీటీ రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని నల్లబెల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తాటికాయల దిలీప్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పనితీరుతో ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతోందని మండిపడ్డారు. ‘రాజుల సొమ్ము రాళ్ళపల్లి అన్నట్లు’ కాంట్రాక్టర్ నాణ్యత లేని రోడ్లను వేస్తూ దళితులకు సంబంధించిన భూమిలోని పైపులను తొలగించి పాత పైపులతో కొత్త మోరీలను నిర్మిస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిచడంలో ఆంతర్యమేమిటని దిలీప్ ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్ తో నాణ్యత ప్రమాణాలతో రోడ్డు వేయించేలా చూడాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments