గతంలో ఐదుగురికి ఆప్షన్..
సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన వాట్సప్
స్పాట్ వాయిస్, డెస్క్: వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకుస్తోంది. స్పామ్, ఫేక్ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ఫీచర్‌ను డెవలప్ చేసింది. వాట్సాప్‌లో ఇప్పటి వరకు ఒక సందేశాన్ని ఐదుగురికి ఒకేసారి ఫార్వర్డ్ చేయొచ్చు. వాటికి ‘ఫార్వర్డెడ్’ అని కనిపిస్తుంది. అయితే.. స్పామ్‌ను తగ్గించే ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌తో మెసేజ్‌లను ఇతర గ్రూపుల్లో, వ్యక్తిగత చాట్లకు పంపడంపై పరిమితులు విధించింది. ‘ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్’ ట్యాగ్‌తో కేవలం ఒకసారి ఒకే గ్రూప్ లేదా ఒక వ్యక్తికి షేర్ చేయొచ్చు. గత నెలలో అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ బీటా వర్షన్ ఆడ్రాయిడ్ 2.22.7.2 అప్డేట్లో ఈ ఫీచర్ వచ్చింది. దీనిపై వినియోగదారుల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కొత్త ఫీచర్‌ను తీసుకురావడాన్ని సమర్థించుకుంది. ఇక ఎవరైన ఫార్వర్డ్ సందేశాన్ని రెండు లేదా అంతకన్నా ఎక్కువ గ్రూపులకు పంపాలని ప్రయత్నిస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఫార్వర్డెడ్ మెసేజ్‌లు కేవలం ఒకసారి ఒకే గ్రూప్‌లోకి పంపించవచ్చు అనే పాపప్ మెనూ కనిపిస్తుంది.
వాట్సప్ మెసేజ్ ఫార్వర్డ్.. ఒక్కసారే.. ఒక్కరికే
RELATED ARTICLES
Recent Comments