Wednesday, December 4, 2024
Homeక్రైమ్ఎక్కడ చంపారు..? ఇక్కడెందుకు వదిలేశారు..!

ఎక్కడ చంపారు..? ఇక్కడెందుకు వదిలేశారు..!

బ్యాంకు ఉద్యోగి దారుణ హత్య
తాళ్లతో కట్టేసి.. కత్తులతో పొడిచి
కారులో డెడ్ బాడీని వదిలేసిన దుండగులు
రాజమోహన్ ది హన్మకొండ శ్రీనగర్.. రంగంపేటలో డెడ్ బాడీ 

సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు..
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ నగరంలో దారుణ హత్య జరిగింది. బ్యాంక్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. కాళ్లు, చేతులను తాళ్లు, ఇనుప గొలుసులతో కట్టేసి ఆయన కారులోనే ఆయనను హత్య చేశారు. అనంతరం కారును వరంగల్ భద్రకాళి గుడి సమీపంలో ఉన్న రంగంపేట ఏరియాలో వదిలిపెట్టి వెళ్లారు. అయితే హత్య ఎప్పుడు జరిగింది..? ఎవరూ చేశారు..? ఎందుకు చేశారనేది పోలీసులకు సవాల్ గా మారింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో అటుగా వెళ్లిన కొందరు స్థానికులు కారులో డెడ్ బాడీని గుర్తించి మట్టెవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా కారులో డెడ్ బాడీ లభ్యమైన విషయం వరంగల్ నగరంలో కలకలం రేపుతుండగా.. ఆయన కాళ్లు, చేతులు కట్టేసి హతమార్చిన తీరు భయాన్ని కలిగిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా మృతుడు బ్యాంక్ ఉద్యోగి కావడంతో ఎవరైనా సుపారీ ఇచ్చి మర్డర్ చేయించి అంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ 36 క్యూ 1546 అనే నెంబర్ గల సాంట్రో కారులో ఉన్న డెడ్ బాడీ ఉన్నట్టు గుర్తించి, మృతుడిని హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వెలిగేటి రాజా మోహన్ గా నిర్ధారణకు వచ్చారు.

తెల్లవారుజామునే హత్య..?
రాజామోహన్ ను కాళ్లు, చేతులను కట్టేసి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తాళ్లు, ఇనుప గొలుసులతో బంధించి మరీ కిరాతకంగా హతమార్చారు. రాజా మోహన్ తలపై మూడు చోట్లా, గొంతు సమీపంలో కూడా కత్తి గాట్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా రాజా మోహన్‌ను తన కారులోనే హత్య చేసి, మంగళవారం తెల్లవారుజామున 3.49 గంటల ప్రాంతంలో ఆ కారును రంగంపేటలో పార్క్ చేసి ఓ వ్యక్తి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ పక్కనే ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు కాగా.. పోలీసులు ఆ రికార్డును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ వ్యక్తి బ్లాక్ స్వెట్టర్ ధరించి కారు వద్ద నుంచి వెళ్తున్నట్టు గుర్తించారు. అతడే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఎన్నెన్నో అనుమానాలు
హత్య జరిగిన తీరు అనేక అనుమానాలను కలిగిస్తోంది. సోమవారం సాయంత్రం రాజా మోహన్ కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వారు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఆచూకీని కోసం ప్రయత్నించారు. అయితే సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రాజమోహన్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం రంగంపేట ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆయన ఫోన్ లో ఎవరితో మాట్లాడారు..? పాత గొడవలు, ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments