వరంగల్ లో రౌడీషీటర్ దారుణ హత్య..
కత్తులు, రాడ్లతో అటాక్ చేసిన దుండగులు
స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ శివనగర్ కు చెందిన రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ చెందిన నలుగురు ఇనుప రాడ్లతో తలపై కొట్టడంతో రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. వరంగల్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ ఫారం వైపు ఉన్న బార్ షాప్ వద్ద మంగళవారం అర్ధరాత్రి నజీర్ ను కొట్టి చంపారు. నజీర్ చనిపోయాడని నిర్ధారించుకు న్న ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు పారిపోయారు. మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో మద్యం మత్తులో ప్రారంభమైన గొడవ పెరిగి పెద్దదిగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బతుకు దేరువు కోసo ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వరే శివనగర్ కు లోకల్ పర్సన్ ను మర్డర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నజీర్ అప్పులు ఇస్తూ వసూళ్లు చేసుకొంటారు. కొంతకాలం నుండి డబ్బులివ్వకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని మంగళవారం రాత్రి పట్టుకొని నిలదీయడంతో మాటమాట పెరిగి హత్యకు దారితీసిన్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మిల్స్ కాలనీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments