స్పాట్ వాయిస్, మహా ముత్తారం: మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మహిళా బంధు సంబరాలను పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టారు. అనంతరం మండల నాయకులు మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏడున్నరేండ్లుగా మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల పింఛన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాల్వచర్ల రాజు, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజిరెడ్డి , సర్పంచ్ లతారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శాంత కుమార్, మహిళలు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి సీఎం పెద్దపీట: జెడ్పీ చైర్మన్ పుట్ట మధు
RELATED ARTICLES
Recent Comments