తూర్పులో తుది దశలో జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణం..
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషితో నెరవేరుతున్న జర్నలిస్టుల సొంతింటి కల
జర్నలిస్టులతో కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు నిర్మించే ఇండ్లతో పాటు జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణం పూర్తైంది. కొద్ది రోజుల్లోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ ఇండ్లను అందజేయనున్నారు. దేశాయిపేడలోని లక్ష్మీ మెగా టౌన్ షిప్ లో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వరంగల్ తూర్పు జర్నలిస్టులతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలోని జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించామన్నారు. నిరంతం ప్రజల సమస్యలను, ప్రభుత్వం చేస్తున్న పనులను, సమాజాన్ని బాగుచేసేలా కష్టపడి తమ కలంతో చైతన్యాన్ని ఇచ్చే జర్నలిస్టులకు తన వంతుగా ఒక శాసనసభ్యుడిగా నియోజకవర్గ జర్నలిస్టుల కోసం ఇండ్లను నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులంతా తప్పులను ప్రశ్నిస్తూనే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులను ప్రజలకు చేరవేయాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో గత వందేళ్లలో జరగని అభివృద్ది పనులు చేపట్టామన్నారు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని, త్వరలో ఇండ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కావటి కవిత రాజుయాదవ్, తూర్పు జర్నలిస్ట్ పరపతి సంఘం అధ్యక్షుడు కొరుకొప్పుల నరేందర్, వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్, తూర్పు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఆడెపు సాగర్, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..
RELATED ARTICLES
Recent Comments