Friday, September 20, 2024
Homeజనరల్ న్యూస్ఈ వారం.. మీ రాశీ ఫలం

ఈ వారం.. మీ రాశీ ఫలం

22-5-2022 నుంచి 28-5-2022 వరకు
మేషం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు.
వృషభం
అనుకున్న వ్యవహారాలు అంచనాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఇంట్లో కొన్ని విషయాలలో సహనం పాటించడం మంచిది.
మిథునం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
కర్కాటకం
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు.
సింహం
ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
కన్య
నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాతమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.
తుల
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. స్ధిరాస్తివిషయంలో సమస్యలు అధిగమిస్తారు. బంధుమిత్రులతోవివాదాల నుంచి బయటపడతారు.
వృశ్చికం
చేపట్టిన వ్యవహారాల్లో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధు, మిత్రులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. ఇంట్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ధనుస్సు
సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహమున చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి.
మకరం
ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సోదరులతో చర్చలు ఫలిస్తాయి.
కుంభం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు తొలగుతాయి. అనారోగ్య సమస్యలు నుంచి బయట పడతారు.
మీనం
చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు తప్పవు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.

బ్రహ్మ శ్రీ డా. అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి
చండి, ప్రత్యంగిరా, మహావిద్య ఉపాసకులు జ్యోతిష, వాస్తు నిపుణులు, పంచాంగ కర్త, సిద్దాంతి
సెల్ నం. 9866077928

RELATED ARTICLES

Most Popular

Recent Comments