షాక్ ఇచ్చిన వాతావరణ శాఖ..
అప్రమత్తంగా ఉండాలని సూచన
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వాయుగుండతో అతలాకుతలం కాగా.. 5వ తేదీ వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
మరో అల్పపీడనం..
RELATED ARTICLES
Recent Comments