Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలునర్సంపేటలో కాషాయ జెండా ఎగురవేస్తాం

నర్సంపేటలో కాషాయ జెండా ఎగురవేస్తాం

నర్సంపేటలో కాషాయ జెండా ఎగురవేస్తాం
నియోజకవర్గ బీజేపీ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట: అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తామని నర్సంపేట నియోజకవర్గ బీజేపీ యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో నర్సంపేట మండలం దాసరి పల్లె కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు మెంబర్ బుడగొండ భిక్షపతి, పర్షనాయక్ తండా యూత్ నాయకులు అజ్మీర సురేష్, చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర మహేష్, వీరమల్ల తిరుపతి, భాషబోయిన రాజ్ కుమార్, సింగరబోయిన అనిల్, బానోజీపేట గ్రామానికి చెందిన సయ్యద్ అమ్జాద్, బీమగని భరత్ చంద్ర, కొర్ర రాజేష్, అజ్మీరా గణేష్ బీజేపీలో చేరారు. వీరికి రాణా ప్రతాప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపైన ప్రజల అసహనంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడతారన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments