Sunday, April 6, 2025
Homeరాజకీయంఫోన్లు ఓపెన్ చేస్తున్నాం.. రండి..

ఫోన్లు ఓపెన్ చేస్తున్నాం.. రండి..

ఫోన్లు ఓపెన్ చేస్తున్నాం.. రండి
ఎమ్మెల్సీ కవితకు ఈడీ లేఖ
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ మంగళవారం లేఖ రాశారు. ఆమె అందించిన మొబైల్ ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా లేదా ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. దీంతో కవిత తరఫున బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈడీ ముందుకెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత మొబైల్‌ను మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ స్టేట్ మెంట్, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను తన న్యాయవాది సోమా భరత్‌ ద్వారా ఈడీకి పంపారు. తర్వాత రెండోరోజు కవిత విచారణకు హాజరైన క్రమంలో కొన్ని మొబైల్ ఫోన్స్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మొబైల్ ఫోన్లను సీల్డ్ కవర్‌లో మీడియాకు చూపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments