స్పాట్ వాయిస్, డెస్క్: ఎండలు దంచికొడుతున్నాయి. గేటు బయట కాలు పెడితే చాలూ.. మాడ సుర్రుమంటోంది. వేసవిలో బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటుంది. అయితే సాధ్యమైనంతగా ఎక్కువ నీరు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దాహం వేస్తున్నప్పుడు లేదా, ప్రతీ రెండు గంటలకోసారి కానీ నీళ్లు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. రోజుకు మహిళలు 2.7 లీటర్లు, ఇక గర్భిణులైతే.. 3 లీటర్ల నీటిని, పురుషులైతే 3.7 లీటర్ల నీటిని తాగాలని సూచిస్తున్నారు. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తగినంత మొత్తంలో శరీరానికి అందించాల్సి ఉంటుంది. నీరు తగినంతగా అందితేనే..శరీరంలోని భాగాలు సరిగ్గా పనిచేస్తాయి. అదే సమయంలో శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది.
Recent Comments