వర్ధన్నపేటలో అవిశ్వాస టెన్షన్..
‘చేయి’ జారుతున్న కౌన్సిలర్లు..
పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ
బీఆర్ఎస్ కౌన్సిలర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం
మరో కౌన్సిలర్ కు కాంగ్రెస్ సీనియర్ లీడర్ తో మందలింపు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్థన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నెల 7వ తేదీన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాల్సి ఉండగా చివరి క్షణంలో ఇద్దరు కౌన్సిలర్లు హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అవిశ్వాసాన్ని ముందుండి నడిపిస్తున్న కౌన్సిలర్ భర్త, అతని గ్రూప్ లో టెన్షన్ మొదలై నట్లు సమాచారం. అవిశ్వాసానికి మద్ధతు కూడగట్టడానికి ఇప్పటికే చాలా ఖర్చు పెట్టిన సదరు కౌన్సిలర్ భర్త, ఈ విషయమై ఇద్దరు కౌన్సిలర్లతో గొడవ పడి నట్లు జోరుగా చర్చ నడుస్తుంది. ఇద్దరు కౌన్సిలర్లలో ఒకరు నాలుగైదు రోజు ల నుంచి అందుబాటులో లేకపోవడంతో అవిశ్వాస గ్రూప్ సభ్యులు సదరు కౌన్సి లర్ ఇంటికి వెళ్లి గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ గొడవ ముదరడంతో విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇదిలా ఉంటే అవిశ్వా సానికి తొలుత మద్ధతిచ్చిన మరో కౌన్సిలర్ కూడా హ్యాండివ్వడానికి ప్రయత్నించ గా కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఒకరు జోక్యం చేసుకొని మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేత జోక్యంతో రెండో కౌన్సిలర్ కూడా దారిలోకి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి అవి శ్వాస ప్రక్రియ సాఫీగా జరుగుతుందా లేదా అనే టెన్షన్ నెలకొంది.
Recent Comments