వర్ధన్నపేటలో వరుస చోరీలు..
ఆలయాలను టార్గెట్ చేస్తున్న దొంగలు
నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంతో పాటు మండలంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. కిరాణం షాపులు, ఆలయాలు, వైన్స్ షాపుల లో దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో ఎప్పుడు తమ ఇండ్లను టార్గెట్ చేస్తారో అని ప్రజలు భయాందోళన గురవుతున్నారు.
దీపావళి రోజున వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న దుర్గమ్మ ,పెద్దమ్మ ఆలయాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. హుండీలను ఎత్తుకెళ్లి పగలకొట్టి నగదు తీసుకోవడంతో పాటు అమ్మవారి మెడలో ఉన్న పుస్తెలతాడు , ముక్కుపుడకను దొంగిలించారు. అదేవిధంగా మిల్లు వద్ద ఉన్న డబ్బాలో సైతం చోరీ చేశారు. దసరా రోజున రాజేశ్వరి ఆలయంలో, అంతకుముందు బ్రాండ్ షాపులలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. వరుస ఘటనలతో నిఘా వ్యవస్థపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Recent Comments