Thursday, November 21, 2024
Homeజిల్లా వార్తలురోడ్డుపై ఇల్లుకట్టాడు..  అడిగితే ఇబ్బంది పెడుతున్నాడు..

రోడ్డుపై ఇల్లుకట్టాడు..  అడిగితే ఇబ్బంది పెడుతున్నాడు..

రోడ్డుపై ఇల్లుకట్టాడు.. 

అడిగితే ఇబ్బంది పెడుతున్నాడు..

కార్పొరేషన్, పోలీసులను ఆశ్రయించిన బాధితులు..

న్యాయం చేయాలని వేడుకోలు.. 

స్పాట్ వాయిస్, బాలసముద్రం :  పబ్లిక్ రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా తమకు దారి లేదంటూ ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసే ఓ కానిస్టేబుల్ ఇబ్బంది పెడుతున్నారని బాధితులు కన్నీరుపెట్టుకున్నారు. బాధితులు జంజిరాల అమరనాథ్, స్వాతి బుధవారం ఏకశిల పార్క్ లో మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ఆర్టీఏ ఆఫీసు వెనక తమ ఇల్లు ఉందని.. మా ఇంటికి పడమర వైపున ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసే పోలీస్ కానిస్టేబుల్ ఇల్లు నిర్మించుకున్నాడన్నారు. అయితే ఇంటికి పడమర వైపు 30 ఫీట్ల రోడ్డు ఉందని, ఆ రోడ్డును కానిస్టేబుల్ సైతం తను ఇల్లు నిర్మించుకునే క్రమంలో కార్పొరేషన్ కు సమర్పించిన ప్లాన్ కాపీలో కూడా చూపించారని చెప్పారు. అయితే ఆ సదురు కానిస్టేబుల్ మాత్రం 30 ఫీట్ల రోడ్డులో సుమారు 12 ఫీట్ల రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా పబ్లిక్ రోడ్డును అక్రమంగా రిజిస్ట్రేషన్ సైతం చేయించాడని చెప్పారు. ఈ విషయమై తాము కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశామని, వారు పట్టించుకోకపోతే లోకాయుక్తకు సైతం వెళ్లామన్నారు. లోకాయుక్త అధికారులు మున్సిపల్ కమిషనర్‌కు అక్రమ నిర్మాణంపై అమరనాథ్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీచేశారని చెప్పారు. లోకాయుక్త ఆదేశాల మేరకు విచారణ జరిపిన కార్పొరేషన్ అధికారులు కానిస్టేబుల్ రోడ్డు ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసినట్లు నివేదికను సైతం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారన్నారు. పబ్లిక్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదంటూ నోటీసులు ఇచ్చారని చెప్పారు. అయితే నోటీసులతో సరిపెట్టిన అధికారులు నేటి వరకు కానిస్టేబుల్ నిర్మించిన ఆక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎన్నిసార్లు కార్యాలయం చుట్టు తిరిగినా పట్టించుకోలేదని కన్నీరుపెట్టుకున్నారు.

 దాడులు చేస్తున్నాడు..

తమకు పడమర వైపు రోడ్డు ఉందనడంతో పాటు అక్రమ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో కక్ష పెంచుకొని కానిస్టేబుల్ దేవేందర్ తమపై దాడులకు సైతం దిగాడని బాధితులు జంజిరాల అమరనాథ్-స్వాతి రోదించారు. తమ పడమర వైపు దర్వాజ ఎదురుగా అతడి కుటుంబ సభ్యులు బండ్లు పార్కింగ్ చేస్తూ.. తాము అటువైపు వెళ్లకూడదని హుకూం జారీ చేస్తున్నాడన్నారు. తమపై దాడులు కూడా చేస్తే ఎంజీఎంలో చికిత్స సైతం పొందినట్లు వెల్లడించారు. గుర్తు తెలియని నలుగురు మహిళలను ఇంటిపైకి పంపించి నానా హంగామా చేపించారంటూ ఫొటోలు చూపించారు. సదురు కానిస్టేబుల్ అక్రమ నిర్మాణం, దాడుల విషయమై బుధవారం సీపీని కలుస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments