Sunday, April 6, 2025
Homeలేటెస్ట్ న్యూస్కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

బూడిదైన షాపుల్లోని వస్తువులు
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ సిటీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లతెలవారుతుండగానే.. మంటల ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వరంగల్ చౌరస్తాలోని మను రెస్టారెంట్, బిగ్ సీ, శివ పేపర్ మార్ట్ ఉన్న కాంప్లెక్స్ శుక్రవారం ఉదయం 5: 30 గంటలకు షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పారు. తెల్లవారుజామున కావడంతో.. కాంప్లెక్స్ లో ఎవరూ లేరని, దీంతో ప్రాణనష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించి భవన యజమాని గుండాసతీష్, నాగ బండి సతీష్ కుటుంబ సభ్యులను వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పరామర్శించారు. ఆయన వెంట రాజనాల శ్రీహరి తాబేటి వెంకట్ గౌడ్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments