మునుగోడు రణం..
చండూరులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై పోస్టర్లు
స్పాట్ వాయిస్ , నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లు గా తలపడుతున్నాయి. మాటల దాడికి పాల్పడుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి కొంత మంది మరో అడుగు ముందుకు వేసి పోస్టర్ రాజకీయానికి తెర తీసారు.
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ పే తరహాలో కాంట్రాక్టు పే రూ. 18000 కోట్ల లావాదేవీలు జరిపారంటూ చండూరులో రాత్రికి రాత్రే పోస్టర్లు అంటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18వేల కోట్లు కేటాచారంటూ వేసిన ఈ పోస్టర్లు మునుగోడు ఉప రణాన్ని మరింత వేడెక్కించింది.
ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు ఇది అధికార పార్టీ చేసిన చిల్లర పని అని ఆరోపించారు. గెలువలేమనే భయంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Recent Comments