స్పాట్ వాయిస్ ,కొత్తగూడ : మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 9న హైదరాబాద్ లో జరిగే యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిడతపల్లి యాకయ్య మాదిగ కోరారు. ఈ మేరకు మహాసభ వాల్ పోస్టర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం అనడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని మర్చిపోయి సోయి లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల రాము ,వట్టం సాయిలు , తీగల ప్రేమ సాగర్, కె దాస్ ప్రసాద్, మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు డేవిడ్ పాల్ రవి ఇమాన్యుల్, నాయకులు ఎం ఎస్ ఎఫ్ మండల నాయకులు కొట్టే శ్రీను, మై స్ సమ్మయ్య, యాకయ్య ,సిద్దబోయిన లక్ష్మీనారాయణ ఏం పెళ్లి కృష్ణ ,వాసం వీరస్వామి, జిమ్మికి సర్దార్ పాల్గొన్నారు.
Recent Comments